సాక్షి, కృష్ణా: తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడ్రస్ లేనిదని.. అందుకే జనం లేక వెలవెల బోతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం విజయవాడలో సాక్షితో మాట్లాడిన ఆయన.. లోకేష్‌తో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేత నారా లోకేష్ రాత్రిది దిగక హ్యాంగోవర్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. లోకేష్ అడ్రస్ లేనోడు. అందుకే పాదయాత్ర వెలవెలబోతోంది. ఓ లక్ష్యమంటూ లేకుండా అదీ రాత్రి పూట వాక్ చేస్తూ.. పాదయాత్ర అని ప్రచారం చేసుకుంటున్నాడు. మేమూ, మా ఎమ్మెల్యేలు చేస్తున్న సవాళ్లకు.. లోకేష్ దగ్గరి నుంచి సమాధానాలు రావడం లేదు అని మండిపడ్డారాయన.
ఇక జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పవన్ భాష చూసి జనం అసహ్యించుకుంటున్నారు. గతంలో రెండుచోట్లా ఓడించి ప్రజలు బట్టలూడదీసినట్లు బుద్ధి చెప్పారు. అందుకేనేమో.. ఇప్పుడు ఇలాంటి భాష వాడుతున్నాడు. పవన్‌కు జనాలతో కొట్టించుకోవడం, తిట్టుంచుకోవడం అలవాటే అని మంత్రి కాకాణి అన్నారు. ప్రస్టేషన్‌లోనే పవన్, లోకేష్‌లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తేల్చేశారాయన.
ఇదీ చదవండి: నీకా దమ్ముందా? నారా లోకేష్‌కు అనిల్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment