సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి శ్రీరామ్‌నగర్‌లో యువతిపై నలుగురిచేత అత్యాచారయత్నం చేయించిన నిందితురాలు గాయత్రి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. సినిమా స్టోరీని తలపిస్తోన్న ఈ కథలో గాయత్రితో పాటు ఆమె భర్తగా చెబుతున్న శ్రీకాంత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోందని చెప్పి.. శ్రీకాంత్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ క్రమంలోనే వారిమధ్య సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి.. వారిద్దరిపై గాయత్రి కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, కేసు విత్ డ్రా పేరుతో బాధితురాలిని ఇంటికి పిలిపించి.. నలుగురు యువకుల చేత గాయత్రి అత్యాచారయత్నం చేయించినట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు.
చదవండి: భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం!
మరోవైపు గాయత్రి కేసులో గచ్చిబౌలి సీఐ సురేష్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సీఐ సురేష్ ప్రోద్బలంతోనే గాయత్రి తమపై అక్రమ కేసులు పెట్టిందని గాయత్రి తల్లి, సోదరి ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించుకోలేదన్నారు. మా ఇంట్లో మమ్మల్నే ఉండొద్దంటూ సీఐ వేధిస్తున్నారని గాయత్రి సోదరి ఆరోపించారు. చాలా కాలంగా గాయత్రికి సీఐ సురేష్ అండగా ఉంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment