నేను చూసిన మంచి సినిమా ఇదే!: బాలీవుడ్‌ నటుడు | Arshad Warsi: This Was The Last Good Film I Saw | Sakshi
Sakshi News home page

Arshad Warsi: కల్కి ఎఫెక్ట్‌.. గుణపాఠం నేర్చుకున్న నటుడు

Published Wed, Oct 30 2024 3:42 PM | Last Updated on Wed, Oct 30 2024 3:59 PM

Arshad Warsi: This Was The Last Good Film I Saw

కల్కి సినిమాలో ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉందని కామెంట్స్‌ చేసి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహావేశాలకు గురయ్యాడు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ. తనపై విపరతీమైన ‍ట్రోలింగ్‌ జరగడంతో ప్రభాస్‌ అద్భుత నటుడని, కేవలం అతడు కల్కి మూవీలో పోషించిన పాత్ర గురించే తాను అలా కామెంట్స్‌ చేశానని వివరణ ఇచ్చాడు.

చాలా నచ్చింది
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో.. ఈ మధ్యకాలంలో చూసినవాటిలో బెస్ట్‌ మూవీ ఇదేనంటూ ఓ హారర్‌ చిత్రానికి కితాబిచ్చాడు. అర్షద్‌ మాట్లాడుతూ.. స్త్రీ 2 మూవీ చూశాను. చాలా నచ్చింది. ఎంతో అద్భుతంగా ఉంది. రాజ్‌ కుమార్‌ రావు అదరగొట్టేశాడు. ఎంతో ఎంజాయ్‌ చేశాను. సినిమా కోసం ఎంత ఖర్చుపెట్టారో కానీ జనాలు అంతకంటే ఎక్కువ ఆదరించారు.

గుణపాఠం నేర్చుకున్న నటుడు
ఇకమీదట నేను చూడబోయే ప్రతి సినిమాను ప్రేమించాలనుకుంటున్నాను. అందుకోసం నా మెదడును సిద్ధం చేసుకున్నాను. ప్రతి కథ, హీరో, దర్శకుడు అందరూ బాగానే చేస్తున్నారని నాకు నేనే చెప్పుకుంటున్నాను అంటున్నాడు. కల్కి ఎఫెక్ట్‌ వల్ల అతడు గుణపాఠం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని సినిమాలను ప్రేమించాలని డిసైడ్‌ అయ్యాడని పలువురూ అభిప్రాయడుతున్నారు.

చదవండి: Yash Toxic Movie: షూటింగ్ కోసం ఆ వేలాది చెట్లు పడగొట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement