తగ్గేదేలే.. దంగల్‌, అవతార్‌-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2! | Stree 2 box office Hits Beats Avengers Endgame and Avatar 2 Lifetime Collections | Sakshi
Sakshi News home page

Stree 2 box office: బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. సలార్‌ రికార్డ్‌పై గురిపెట్టిన స్త్రీ-2!

Published Mon, Aug 26 2024 2:16 PM | Last Updated on Mon, Aug 26 2024 3:10 PM

Stree 2 box office Hits Beats Avengers Endgame  and Avatar 2 Lifetime Collections

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్‌ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది.

అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా  'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.

ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్‌ పార్ట్‌-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్‌ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది.  కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement