సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' అల్టిమేట్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్ సాధిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ చేయడానికి ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి గానీ హీరో తేజ సజ్జా గురించి తెలుగులోనే పెద్దగా తెలియదు. అలాంటిది ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజులో సక్సెస్ కావడంతో వీళ్లకు ఊహించనంత ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత 'ఓ బేబీ', 'జాంబీ రెడ్డి', 'అద్భుతం' లాంటి చిత్రాలతో హీరోగా చేశాడు. అయితే హీరోగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ 'హనుమాన్' దెబ్బకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే దాదాపు 70-75కి పైగా ప్రాజెక్టుల్ని రిజెక్ట్ చేశానని తేజ చెప్పుకొచ్చాడు.
''హనుమాన్' మూవీ చేస్తున్న సమయంలోనే దాదాపు 70-75 సినిమాల్ని రిజెక్ట్ చేశారు. వీటిలో దాదాపు 15 స్టోరీల‍్ని సినిమాలుగా చేయొచ్చు. కానీ హనుమాన్'కి పూర్తిస్థాయిలో కమిట్‌మెంట్ ఇవ్వాల్సి రావడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ ఓ మల్టీస్టారర్‌లో నటించినట్లు సమాచారం. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.
Comments
Please login to add a commentAdd a comment