
హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్‌లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు.
సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment