
టాలీవుడ్.. ఈసారి సంక్రాంతిని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే సినిమాలు-రిలీజులు-థియేటర్లల పంపకాల విషయంలో చాలా రచ్చ జరిగింది. 'గుంటూరు కారం' కోసం 'హనుమాన్'కి అన్యాయం చేశారని, దీనికి దిల్‌రాజే కారణమని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్ తెచ్చుకోగా, మహేశ్ మూవీకి మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే 'గుంటూరు కారం' సినిమాకు టాక్ అటుఇటుగా వచ్చినప్పటికీ తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే నిర్మాత నాగవంశీ, నైజాంలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు కలిసి తాజాగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. థియేటర్ల విషయమై జరిగిన గొడవ గురించి దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!)
''గుంటూరు కారం' సినిమాకు అర్థరాత్రి ఒంటి గంట షో అయిపోయిన తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. పర్వాలేదు, యావరేజ్ అని కొందరు.. బావుంది అని ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు. కానీ నేను సుదర్శన్ థియేటర్లలో మళ్లీ సినిమా చూశాను. ఇది మహేశ్ బాబుని బేస్ చేసుకుని తీసిన సినిమా. తల్లికొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. కచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగిటివ్ వైబ్స్, రివ్యూలు చూసి థియేటర్లకు వెళ్లినా సరే.. సినిమాకు విషయముండి, కనెక్ట్ అయితే స్టాండ్ అవుతుంది. ఇలా ఎన్నో సినిమాలు చూశాం. అవన్నీ బ్లాక్‌బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
'సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమాని ఏదైనా కానీ ఎవడూ ఆపడు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి రాగానే మా అందరి మధ్య యుద్ధం జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్‌గా ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరూ ఎవరికి శత్రువులు కాదు. మిత్రులు కాదు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగానే చూస్తాం. ఇంకో రెండు రోజుల తర్వాత ఈ టాపిక్ ఎవరూ మాట్లాడరు' అని దిల్ రాజు అన్నారు.
(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)
#DilRaju says Sankranthi Wars are common and ultimately this is all Business and there are No friends or enemies here!! pic.twitter.com/TDeVWOkNFZ
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 13, 2024