హనుమాన్‌ మూవీ చూస్తూ వింతగా ప్రవర్తించిన మహిళ | Woman Strange Behavior While Watching Hanuman Movie | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో హనుమాన్‌ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్‌

Published Wed, Jan 31 2024 3:31 PM | Last Updated on Wed, Jan 31 2024 3:46 PM

Woman Strange Behavior While Watching Hanuman Movie - Sakshi

పెద్ద సినిమాల మధ్య చిన్న మూవీ విడుదలైంది. ఆ భారీ బడ్జెట్‌ చిత్రాల కలెక్షన్ల తుపానులో అది కొట్టుకుపోతుందనుకున్నారంతా! కానీ ఇక్కడ సీన్‌ రివర్సయింది. ఈ చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు వెలవెలబోయాయి. ఏ మూవీ గురించే చెప్తున్నామో ఈపాటికే అర్థమైపోయుంటుంది. రూ.50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్‌ ఐదు రెట్ల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది.

పూనకంతో ఊగిపోయిన మహిళ
ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఓ చోట ఆసక్తికర సంఘటన జరిగింది. థియేటర్‌లో హనుమాన్‌ సినిమా చూస్తున్న ఓ మహిళ హనుమాన్‌ చాలీసా మొదలవగానే పూనకమొచ్చినట్లుగా ఊగిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ మెలికలు తిరిగింది. పక్కన ఉన్నవాళ్లు ఆమెను పట్టుకుని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె సీటులో కూర్చోలేక అరుస్తూ వింతగా ప్రవర్తించింది.

వీడియో వైరల్‌
ఈ ఘటన ఉప్పల్‌లోని ఏషియన్‌ మాల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మహిళ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు హనుమాన్‌ పూనాడని అంటుండగా, మరికొందరు ఆమెలో దుష్ట శక్తి ఏదో ఉన్నట్లుంది, అందుకే చాలీసా రాగానే అలా ప్రవర్తించిందని కామెంట్లు చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం 'అదంతా ఏం కాదు.. తనకు ఫిట్స్‌ వచ్చినట్లుంది, లేదంటే ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లుంది' అని అభిప్రాయపడుతున్నారు.

చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? ఆ ఫోటోలు ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement