
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'హను-మాన్' మేనియా నడుస్తోంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ.. ప్రేక్షకాదరణ దక్కించుకుని హిట్ కొట్టేసింది. ఈ క్రమంలోనే అందరూ 'హనుమాన్'ని చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే టైంలో మరో 'హనుమాన్'.. ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు?
(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)
తెలుగు నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసి తీసిన సినిమా 'హను-మాన్'. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసి పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేశారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ వేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాల్ని అందుకుని పాజిటిక్ టాక్ సంపాదించేసుకుంది. ఇదే టైంలో 'గుంటూరు కారం'కి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. దీంతో 'హనుమాన్' వైపు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే థియేటర్‌కి వెళ్లి ఆంజనేయుడిని చూడటం వీలుకాకపోతే ఇంట్లో కూర్చుని కూడా ఆయన్ని చూసేయొచ్చు. ఎందుకంటే 'ద లెజండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3' కూడా శుక్రవారం రిలీజైంది. కాకపోతే ఇది యానిమేటెడ్ సిరీస్. దీనికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలా ఒకేరోజు అటు థియేటర్‌లో ఓ హనుమంతుడు వస్తే.. ఓటీటీలో మరో ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. సినీ ప్రేమికుడిని 'హనుమన్' మేనియాలో మైమరచిపోయేలా చేశారు. హనుమాన్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)