అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్ కలెక్షన్స్ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు.
హనుమాన్ ప్రభంజనం..
ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ చేతిలో 12 కథలు
ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్, బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి!
చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment