
చూస్తుండగానే మరో వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. అలాగే ఈ సారి థియేటర్లలో అలరించేందుకు గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి లాంటి పెద్ద చిత్రాలు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా వీటితో మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
అలాగే ఓటీటీ ప్రియులు కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీసులు సిద్ధమైపోయాయి. అయితే టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ స్ట్రీమింగ్ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా జీ5లో సందడి చేయనుంది. దీంతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా అన్వేషిప్పిన్ కండేతుమ్, కన్నడ డబ్బింగ్ సినిమా 'బ్యాచిలర్ పార్టీ' కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్..
- హాట్ వీల్స్ లెట్స్ రేస్(ఇంగ్లీష్)- మార్చి 04
- హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05
- ఫుల్ స్వింగ్(నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ -సీజన్ 2- మార్చి 06
- ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06
- సూపర్ సెక్స్- మార్చి 06
- ది జెంటిల్‌మెన్- మార్చి 07
- పోకెమాన్ హారిజన్స్-(వెబ్ సిరీస్)- మార్చి 07
- ది సిగ్నల్- మార్చి 07
- బ్లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08
- డామ్ సెల్- (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08
- ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09
- అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 8
అమెజాన్ ప్రైమ్
- 'బ్యాచిలర్ పార్టీ'(కన్నడ డబ్బింగ్ సినిమా)- మార్చి 04
జీ5
హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 8
Comments
Please login to add a commentAdd a comment