సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఒక్కటి తప్ప! అవును హనుమాన్ ఒక్కటే ఇంకా ఏ ఓటీటీలోనూ అందుబాటులోకి రాలేదు. గుంటూరు కారం.. నెట్‌ఫ్లిక్స్‌లో, సైంధవ్.. అమెజాన్ ప్రైమ్‌లో, నా సామిరంగ.. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తూ ఓటీటీని లైట్ తీసుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. అదిగో రిలీజ్.. ఇదిగో రిలీజ్.. అంటూ ఊరిస్తున్నారే తప్ప నిజంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి! దీంతో ఓ నెటిజన్.. హనుమాన్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని ఎక్స్(ట్విటర్)లో మొర పెట్టుకున్నాడు. ఇది చూసిన జీ5.. సదరు ట్వీట్‌కు స్పందించింది.
'హనుమాన్ రిలీజ్ విషయంలో మాకే ఇంతవరకు ఎటువంటి అప్‌డేట్ లేదు' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కే క్లారిటీ లేనప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో? ఏంటో? అని నిరాశ చెందుతున్నారు. రేపు రిలీజ్ చేస్తే సినిమా చూస్తూ అర్ధరాత్రి జాగారం చేసేవాళ్లంగా అని కామెంట్లు చేస్తున్నారు.
Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates!
— ZEE5 (@ZEE5India) March 7, 2024
Comments
Please login to add a commentAdd a comment