
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. ప్రస్తుతం అతడు నటించిన హనుమాన్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. అసలే సంక్రాంతికి మరో మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా హనుమాన్ వెనక్కు తగ్గలేదు. వాటితో పాటు ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజవుతుందని నిర్మాతలు నొక్కి చెప్తున్నారు. దీంతో ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది.
ఈ క్రమంలో పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ హీరో తేజ సజ్జాకు ఓ బహుమతినిచ్చాడు. హీరోను కలిసి ఓ మహిమాన్విత బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడట! ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఏదైనా సినిమా హిట్టయ్యాక సదరు నిర్మాత హీరోకు బహుమతి ఇస్తుంటాడు. ఇక్కడ సినిమా రిలీజవకముందే వేరే నిర్మాత వచ్చి హీరోను అభినందిస్తూ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. హనుమాన్ సినిమా విషయానికి వస్తే దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ పొంగల్ కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
చదవండి: సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్
హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు
Comments
Please login to add a commentAdd a comment