'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్‌ చరణ్? | Ram Charan Play Lord Rama Role In Prasanth Varma Jai Hanuman Movie - Sakshi
Sakshi News home page

Ram Charan: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో చరణ్.. రాముడిగా చేయబోతున్నాడా?

Published Wed, Jan 17 2024 7:31 PM | Last Updated on Wed, Jan 17 2024 7:49 PM

Ram Charan Play Lord Rama Role In Prasanth Varma Cinematic Universe - Sakshi

ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'హనుమాన్' నామజపమే వినిపిస్తోంది. స్టార్ హీరో గానీ డైరెక్టర్ గానీ లేకుండా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్‌లో ఇక్కడ, ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'హనుమాన్' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే 'హనుమాన్'లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఓ ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు. తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా.

(ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్‌ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!)

అలానే 'హనుమాన్' చిత్ర క్లైమాక్స్‌లో 'జై హనుమాన్' అనే మరో సినిమా 2025లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి. మెగాహీరో రామ్ చరణ్.. ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'లోని సెకండాఫ్‌లో చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతమున్న హీరోల్లో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ కావొచ్చనమాట. అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్‌లానే కనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కి అంతకు మించిన పండగ మరొకటి ఉండదేమో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement