ఈసారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. జనాలు చూడటానికి వెళ్తూనే ఉన్నారు. తాజాగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే థియేట్రికల్ రన్ చివరకొచ్చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!)
తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. 'హనుమాన్'ని వాయిదా వేసుకోవాలని బెదిరించారు. కానీ తగ్గకుండా బరిలో నిలిబడ్డారు. పండగ విజేతగా నిలిచారు.
(ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ)
'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment