ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా .. హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి.
థియేటర్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్ కలెక్షన్స్ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్‌లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
First award for #HanuMan 🙂
— Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024
Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro
Comments
Please login to add a commentAdd a comment