ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నభా నటేష్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో నభా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం నభా భుజానికి తీవ్ర గాయం అయింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తాజాగా ‘డార్లింగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నభా మీడియాతో మాట్లాడుతూ..యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిన పరిస్థితి ఎలా ఉందో వివరించింది.
(చదవండి: అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్)
‘నా సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోయాను. ఆపరేషన్ అయిన పది రోజులకే షూటింగ్‌లో పాల్గొన్నాను. దీంతో నా హెల్త్ మళ్లీ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకో సర్జరీ జరిగింది. నా శరీరానికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలనిపించింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని ఫిక్స్ అయ్యాను. చాలా కేర్ తీసుకొని 6 నెలల పాటు నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ఫిజికల్‌గా ఫిట్ లేకుంటే సినిమాలు చేయలేం. అందుకే సమయం తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను.
చాలా గ్యాప్ తార్వత ‘డార్లింగ్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ సినిమా తర్వాత ‘డార్లింగ్’ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. బట్ ఆడియన్స్‌కి తెలుసు..ఇప్పుడు కంటెంట్ అనేది న్యూ కమర్షియల్ అని. డైరెక్టర్ అశ్విన్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని నభా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment