ప్రియదర్శికి హీరోయిన్‌ వార్నింగ్‌! అంత మాట అనేసిందేంటి! | Tollywood Heroine Nabha Natesh Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Nabha Natesh: ప్రభాస్‌పై హీరోయిన్ అలాంటి పోస్ట్.. లైట్‌ తీస్కోమన్న ప్రియదర్శి!

Apr 18 2024 7:29 AM | Updated on Apr 18 2024 12:39 PM

Tollywood Heroine Nabha Natesh Tweet Goes Viral  - Sakshi

టాలీవుడ్‌లో గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా.. నభా నటేష్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ పాన్‌ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా నభా నటేశ్‌ చేసిన ఓ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్‌ డార్లింగ్ అంటూ చెప్పే డైలాగులతో ఓ వీడియోను పంచుకుంది. ఇది చూసిన ప్రియదర్శి పులికొండ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్‌ ఉన్నావ్ డార్లింగ్.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రియదర్శి చేసిన కామెంట్స్‌పై నభా నటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్టర్.. ఒకరిని కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త, హద్దులు దాటొద్దు.. అంటూ మండిపడింది.

అలాగే పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని గతంలో కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానికి సంబంధించిన వార్త క్లిప్‌ను నభా నటేశ్ షేర్ చేసింది. ఇది చూసిన ప్రియదర్శి సైతం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్‌ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్‌ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్‌ అంటూ పోస్ట్ చేశారు. ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మాత్రం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. కాగా.. ప్రియదర్శి ఇటీవల సేవ్ ది టైగర్స్‌-2 సీజన్‌తో ప్రేక్షకులను అలరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement