
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవెరి’ అన్నది ట్యాగ్‌లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాహి రే...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ‘‘యునిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘రాహి రే...’ పాట మెలోడియస్‌గా సాగుతుంది. నభా నటేశ్ పై సాగే ఈ పాటను సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment