![Tollywood Actor Divya Narni Engagement Pics Viral - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/19/divya-narni.jpg.webp?itok=gxDbwj7s)
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. రీసెంట్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు నిశ్చితార్థం, సీనియర్ నటుడు విజయ్ కుమార్ మనవరాలి పెళ్లి లాంటివి జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యువ నటి కూడా ఎంగేజ్‍మెంట్ చేసుకుంది.
(ఇదీ చదవండి: ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్!)
'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన దివ్య.. ఆ తర్వాత హిట్ 2, ఆర్ఎక్స్ 100, బెదురులంక, 'అద్భుతం' తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై డ్యాన్స్ షోల్లోనూ యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)
Comments
Please login to add a commentAdd a comment