Unknown Person Follows Telugu Actress Chaurasia At KBR Park - Sakshi
Sakshi News home page

KBR Park Incident: పార్క్‌లో యువనటికి చేదు అనుభవం, రెండేళ్ల నాటి ఘటన రిపీట్‌

Published Thu, Mar 2 2023 8:51 AM | Last Updated on Thu, Mar 2 2023 9:16 AM

Unknown Follows Telugu Actress Chaurasia at KBR Park in Banjara Hills - Sakshi

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో సినీ నటికి చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం పూట వాకింగ్‌కి వచ్చిన ఆమెను ఓ వ్యక్తి వెంబడించి చుక్కలు చూపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు సమాచారం ప్రకారం వివరాలు.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసించే ఈ యువ నటి బుధవారం రాత్రి కేబీఆర్ పార్క్‌కు నడక కోసం వచ్చింది.

చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ తల్లి

రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె పార్క్‌లో నడుస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. తను ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాడు. నడిస్తే నడుస్తున్నాడని ఆమె గమనించింది. ఇలా దాదాపు ఐదు సార్లు పరిక్షించిన ఆమె వెంటనే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న స్థానికులకు, పార్క్‌ సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. దీంతో అందరు కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని కొండాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పార్క్‌ సిబ్బంది ఆరా తీయగా పొందన లేని సమాధానాలు చెప్పాడు.

చదవండి: కృష్ణవంశీకి పిచ్చా, ఈమె హీరోయిన్‌ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత

దీంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నటికి గతంలోనూ కేబీఆర్‌ పార్క్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2021 ఏడాదిలో ఓ రోజు సాయంత్రం వాక్‌ వచ్చిన ఆమెను ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి యత్నించాడు. అది కుదరకపోవడంతో బండరాయితో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. ఇప్పుడు తాజాగా అదే నటిని ఆగంతకుడు వెంటాడటం పలు అనుమానాలనున రేకెత్తిస్తోంది. అయితే ఆ నటి పేరు షాలూ చౌరాసియా అని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement