![Actress Pavithra Lokesh Fires On Allegations about Marriage With Naresh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/2/pavithra-lokesh.jpg.webp?itok=P2Y5Z8pL)
సీనియర్ హీరో, నటుడు నరేశ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాం అవుతున్నాయి. నటి పవిత్రా లోకేశ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య తెరపైకి వచ్చి నరేశ్‌కు తనకు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నరేశ్ నిజంగానే పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకుల నోటీసులు ఇచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది.
చదవండి: పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు
ఈ క్రమంలో నరేశ్ పెళ్లి అంశం, రమ్య ఆరోపణలపై నటి పవిత్ర స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేశ్ మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. చాల సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులకు నేను దగ్గరయ్యాను. ఇప్పుడు నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. నరేశ్ ఎవరనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ ఆయన మూడో భార్య రమ్య ఇక్కడ బెంగళూరు మీడియాతో నా గురించి, నరేశ్ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన గురించి, నా గురించి చాలా ఆసభ్యంగా మాట్లాడుతన్నారు. మేం రిలేషన్‌లో ఉన్నామని, పెళ్లి చేసుకున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంత నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నన్ను ఒక దోషిగా చిత్రీకరించారు ఆమె’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ‘అయితే ఇప్పటికే నరేశ్ గారు కూడా బెంగళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మా మధ్య ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా మధ్య ఏం లేదు.
చదవండి: Ram Charan-RC15: భిన్నమైన లుక్‌లో రామ్ చరణ్, వీడియో వైరల్
ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే.. నాకు భర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నరేశ్ గారు తెలుగులో మంచి పేరున్న నటుడు. ఆయన ఆమె భర్త అయితే ఏదైన ఉంటే హైదరాబాద్‌లో కదా ఆమె మాట్లాడిల్సింది. పెద్ద వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వారందరిని పిలిచి ఇలాంటిది జరుగుతుందంటూ వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ బెంగళూరు వచ్చి నన్ను చాలా చెడ్డగా చూపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైన మీరందరు నాకు, నరేశ్‌కు సపోర్టు చేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE
— Medi Samrat (@Journo_Samrat) July 1, 2022
Comments
Please login to add a commentAdd a comment