Senior actor Naresh
-
పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. నరేశ్ కీలక ప్రకటన
సీనియర్ నటుడు నరేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సహచర నటి, స్నేహితురాలు పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేస్తూ..‘కొత్త ఏడాది.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశిస్సులు కావాలి. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం’అని నరేశ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గొడవ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కలిసి తిరగడం తగ్గించారు. పవిత్ర సైతం కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఎట్టకేలకు 2023లో నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే నరేశ్ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
సినిమా రిలీజైన రెండో రోజుకే థియేటర్లు ఖాళీ: నరేశ్ ట్వీట్స్ వైరల్
జూలైలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో.. ఈ ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావడమే మానేశారని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్ ఉంటే జనాలు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు నిరూపించాయి. అయితే జనాలు థియేటర్‌కు రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నాడు సీనియర్ నటుడు నరేశ్. 'టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావడం లేదన్న మాట వాస్తవమే! కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్ రూ,20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి' అని నరేశ్ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే మరో ట్వీట్లో.. 'నేనేమంటున్నానంటే.. ఒకప్పుడు వారం రోజులపాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don’t want just a good film but. A good experience. Think!!! — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 చదవండి: ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు? -
దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్టు ఇవ్వండి..
సీనియర్ హీరో, నటుడు నరేశ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాం అవుతున్నాయి. నటి పవిత్రా లోకేశ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య తెరపైకి వచ్చి నరేశ్‌కు తనకు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నరేశ్ నిజంగానే పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకుల నోటీసులు ఇచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. చదవండి: పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు ఈ క్రమంలో నరేశ్ పెళ్లి అంశం, రమ్య ఆరోపణలపై నటి పవిత్ర స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేశ్ మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. చాల సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులకు నేను దగ్గరయ్యాను. ఇప్పుడు నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. నరేశ్ ఎవరనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మూడో భార్య రమ్య ఇక్కడ బెంగళూరు మీడియాతో నా గురించి, నరేశ్ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన గురించి, నా గురించి చాలా ఆసభ్యంగా మాట్లాడుతన్నారు. మేం రిలేషన్లో ఉన్నామని, పెళ్లి చేసుకున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంత నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నన్ను ఒక దోషిగా చిత్రీకరించారు ఆమె’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ‘అయితే ఇప్పటికే నరేశ్ గారు కూడా బెంగళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మా మధ్య ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా మధ్య ఏం లేదు. చదవండి: Ram Charan-RC15: భిన్నమైన లుక్‌లో రామ్ చరణ్, వీడియో వైరల్ ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే.. నాకు భర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నరేశ్ గారు తెలుగులో మంచి పేరున్న నటుడు. ఆయన ఆమె భర్త అయితే ఏదైన ఉంటే హైదరాబాద్‌లో కదా ఆమె మాట్లాడిల్సింది. పెద్ద వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వారందరిని పిలిచి ఇలాంటిది జరుగుతుందంటూ వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ బెంగళూరు వచ్చి నన్ను చాలా చెడ్డగా చూపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైన మీరందరు నాకు, నరేశ్‌కు సపోర్టు చేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE — Medi Samrat (@Journo_Samrat) July 1, 2022 -
సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీపై తాజాగా మాజీ ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. రీసెంట్గా సీఎం జగన్‌తో జరిగిన సినీ పెద్ద సమావేశం అభినందనీయమని పేర్కొన్నాడు. ఈ భేటీపై నరేశ్ హర్షం వ్యక్తం చేస్తూనే.. ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరమని సోషల్ మీడియా వేదిక అభిప్రాపడ్డాడు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఈ మేరకు ‘సీఎం జగన్‌తో భేటీ ప్రశంసించదగ్గదని. కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్ పెట్టడం అవసరం. తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబించే విధంగా.. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలు జారీ చేయాలి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చదవండి: ఆ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా? కాగా ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న సీఎం జగన్‌తో జరిగిన ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణ మొరళితో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్ల అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతి మేరకు సీఎం జగన్ ఏపీలో 5వ షోకు అంగీకారం తెలిపారు. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ పెద్దలు.. త్వరలోనే పరిశ్రమకు శుభవార్త వస్తుందని చెప్పారు. The meeting with cm is laudable. But the need of the hour is a work shop led by FILM CHAMBER on larger interests of TFi,amicable solutions & resolutions passed OFFICIALY & democratically reflecting the unity of TFI & earning da respect of da govt & people. Hopefully soon — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 12, 2022 -
నానక్‌రామ్‌గూడ : విజయనిర్మల విగ్రహావిష్కరణ
-
విజయనిర్మల విగ్రహావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నటిగా, దర్శకనిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయనిర్మల గతేడాది జూన్ 27న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసంలో ఆమె తొలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత విజయ నిర్మల విగ్రహాన్ని కృష్ణ, మహేశ్‌బాబు, నరేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు దంపతులు, మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, సుధీర్ బాబు, పరుచూరి బ్రదర్స్, గల్లా జయదేవ్, తదితరులు పాల్గొన్నారు. ఘట్టమనేని అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయ నిర్మల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అలసి విశ్రమించిన అలలు అది నా తప్పు కాదు, క్యారెక్టర్ అలాంటిది -
ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత
-
విజయనిర్మల కన్నుమూత
హైదరాబాద్: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష ఆమె దర్శకత్వం వహించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. విజయనిర్మల నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు మొత్తం అక్కడేవుంచి రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకువస్తారు. శుక్రవారం విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. -
నా మాట నిజమైంది
‘ఇంద్రగంటిగారు నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పినప్పుడే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పా. నా మాట నిజమైంది. సుధీర్‌బాబు కెరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ అవుతుందని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పా. నేను అన్నట్లుగానే జరిగింది’’ అని నటుడు నరేశ్ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ సినిమా ఈనెల 15న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించిన నరేశ్ మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్ర పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. పెద్ద డైరెక్టర్స్‌తో పాటు చిన్న డైరెక్టర్స్ ఆరోగ్యకరమైన, మంచి సినిమాలు చేస్తున్నారు. సినిమాను సినిమాగా తీస్తే సక్సెస్ కావు. సామాన్య ప్రేక్షకుడి దృష్టితో తీయాలని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా. నటుడిగా ఎస్.వి.రంగారావుగారిని, కమల్‌హాసన్‌గారిని ఇష్టపడుతుంటాను. అందుకే నా కెరీర్ బిగినింగ్ నుంచి విలక్షణమైన పాత్రలు చేస్తున్నా’’ అన్నారు. -
డాక్టర్ నరేశ్!
సీనియర్ నటుడు నరేశ్ డాక్టరయ్యారు. న్యూయార్క్ కు చెందిన ‘అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ‘డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్’ అవార్డు అందుకున్న నరేశ్ మాట్లాడుతూ- ‘‘దక్షిణాదిన నాకు, కర్ణాటకకు చెందిన ఓ భరతనాట్య కళాకారిణికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఇటీవల తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ‘నవరసరాయ’ బిరుదు అందుకున్నా. నాకు నటన నేర్పిన గురువు జంధ్యాలగారు, విజయనిర్మలగారు, కృష్ణ గార్లకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ డాక్టరేట్‌ను అంకితం చేస్తున్నా’’ అన్నారు. త్వరలో విడుదల కానున్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’తో పాటు తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తున్నాననీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ చిత్రం చేయనున్నాననీ చెప్పారు. -
ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ పుట్టినరోజు వేడుక బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, నటులు శివాజీరాజా, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేశ్ మాట్లాడుతూ - ‘‘కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల నా కెరీర్‌కు మూలస్తంభాల్లాగా నిలిచారు. ఈ ఏడాది రిలీజైన ‘నేను... శైలజ’ తో నాకు మళ్లీ సక్సెస్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో మహేశ్‌తో కలసి నటించాలనుకున్నాను. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో ఆ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2016 నాకు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. -
విభిన్న ప్రేమకథ
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా పరిచయమవుతు న్నారు. రెగ్యులర్ లవ్‌స్టోరీలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో నవీన్ విజయ్ కృష్ణ సరసన కీర్తీ సురేశ్ నాయిక. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ రఘుతు దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడ్డాల చంటి మాట్లాడుతూ -‘‘సినిమా బాగా వస్తోంది. ఏప్రిల్ 10న విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ప్రేమకథలో సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రానికి నాగబాబు, రాహుల్‌దేవ్ పోషించిన పాత్రలు హైలైట్’’ అని దర్శకుడు పేర్కొన్నారు.