డాక్టర్ నరేశ్! | Senior actor Naresh got 'Doctor of Arts' award | Sakshi
Sakshi News home page

డాక్టర్ నరేశ్!

Published Sun, Mar 6 2016 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

డాక్టర్ నరేశ్!

డాక్టర్ నరేశ్!

సీనియర్ నటుడు నరేశ్ డాక్టరయ్యారు. న్యూయార్క్ కు చెందిన ‘అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ‘డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్’ అవార్డు అందుకున్న నరేశ్ మాట్లాడుతూ- ‘‘దక్షిణాదిన నాకు, కర్ణాటకకు చెందిన ఓ భరతనాట్య కళాకారిణికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఇటీవల తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ‘నవరసరాయ’ బిరుదు అందుకున్నా. నాకు నటన నేర్పిన గురువు జంధ్యాలగారు, విజయనిర్మలగారు, కృష్ణ గార్లకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ  డాక్టరేట్‌ను అంకితం చేస్తున్నా’’ అన్నారు. త్వరలో విడుదల కానున్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’తో పాటు తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తున్నాననీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ చిత్రం చేయనున్నాననీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement