
‘విక్రమార్కుడు’ మూవీ ఫేం, ప్రముఖ నటి జయవాణి ఓ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర సంఘటనలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో.. నేను నల్లగా ఉన్నానని, నటిగా పనికి రాను అంటూ తీవ్రంగా అవమానించారు.
చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి!
అదే సమయంలో ఓ డైరెక్టర్ సినిమాలో చాన్స్ ఉంది చేస్తావా? అని అడిగారు. వెంటనే నేరు ఒకే చెప్పాను. ఆ తర్వాత నన్ను ఫొటోషూట్‌కు రమ్మని చెప్పాడు. ఫొటోషూట్ తర్వాత ఆయన నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. కనీసం ఫోన్‌కాల్ కూడా లేదు. అలా ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు’ అంటూ తనకు ఎదురైన చేదు అనభవాన్ని గుర్తు చేసింది. అయితే అప్పుడు తను ఇచ్చిన ఫొటోషూట్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారని, అవి చూసి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వాటి వల్ల బంధువులు, సన్నిహితులు నాతో మాట్లాడటం మానేశారని తెలిపింది.
చదవండి: అల్లు అర్జున్‌పై ట్రోల్స్, నెటిజన్ల మండిపాటు
అలా ఆ ఫొటోలు తన కెరీర్‌కే ఓ మచ్చగా నిలిచిపోయాయంటూ జయవాణి వాపోయింది. అయితే వాటిని వెబ్‌సైట్‌లో ఎవరూ పెట్టారనేది ఇప్పటికి తనకు తెలియదని పేర్కొంది. కాగా విజయవాడలో జన్మించిన జయవాణి బి.ఏ. వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుపెట్టింది. మొదట ‘రండి లక్షాధికారి కండి’ అనే టీవీ సీరియల్‌తో పరిచమైంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా గుర్తింపు చెచ్చుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన అనుకున్నంత ఫేం రాకపోవడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమేనని జయవాణి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment