Actress Sreevani Buys New Flat, Empty Home Tour Video Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Sreevani: బుల్లితెర నటి సొంతింటి కల సాకారం, ఇల్లు చూశారా?

Published Thu, Oct 20 2022 5:37 PM | Last Updated on Thu, Oct 20 2022 6:55 PM

Actress Sreevani Buys New Flat, Empty Home Tour - Sakshi

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా ప్రతికూల పాత్రల్లో కనిపిస్తూ విలనిజం పండించిన ఆమె ఆ మధ్య అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే! దీని వల్ల ఆమె గొంతు మూగబోయింది. మంచి చికిత్స తీసుకోవడం వల్ల నెల రోజుల తర్వాత ఆమె తిరిగి ఎప్పటిలా గలగలా మాట్లాడగలిగింది.

తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులతో పంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది శ్రీవాణి. గత కొంతకాలంగా సర్‌ప్రైజ్‌ అంటూ ఊరిస్తూ వచ్చిన ఆమె అదేంటో బయటపెట్టేసింది. ఓ కొత్త ఫ్లాట్‌ కొన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయిందని పేర్కొంది. అంతేకాదు, ఎంప్టీ హౌస్‌ పేరిట యూట్యూబ్‌లో వీడియో రిలీజ్‌ చేసి అందులో ఆ ఇంటినంతా ఓసారి తిప్పి చూపించింది. 

తూర్పు ఫేసింగ్‌ ఉన్న ఆ ఫ్లాట్‌లో ఒక హాల్‌, ఓపెన్‌ కిచెన్‌, డైనింగ్‌ ఏరియా, పూజగది, మూడు బెడ్‌రూమ్స్‌, బాల్కనీ, యుటిలిటీ ఏరియా ఉన్నాయి. ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించాక ఈ ఇంటికి షిఫ్ట్‌ అవుతామంది. తమ కొత్తింటిని చూపిస్తూ తెగ మురిసిపోయింది శ్రీవాణి. ఆమె సొంతింటి కల నెరవేరడంతో శుభాకాంక్షలు చెప్తున్నారు శ్రీవాణి ఫ్యాన్స్‌.

చదవండి: యాంకర్‌ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్‌ ఏమన్నాడంటే?
దీపావళికి థియేటర్స్‌లో సందడి చేసే సినిమాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement