
దళితుల సామాజిక బహిష్కరణ దారుణం
● జైభీమ్‌రావు భారత్ పార్టీ ప్రతినిధులు
నెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం దారుణమని జై భీమ్‌రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని సతివాడ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో ఘటన జరగడం అగ్రకులాల దురహంకారానికి నిదర్శనమన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, దళిత వ్యక్తిని చంపినప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామస్తులపై అట్రాసిటి కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.