
ఫలితాల్లో మేటిగా..
● మండలాలవారీగా సీతంపేట(99.59 శాతం), జీఎల్‌పురం(98.94), పాచిపెంట(96.20), సాలూరు(95.27), జియ్యమ్మవలస(95.03 శాతం) మొదటి అయిదు స్థానాల్లో ఫలితాలపరంగా నిలిచాయి. వీరఘట్టం(87.79 శాతం), సీతానగరం(86.85 శాతం) అట్టడుగున ఉన్నాయి.
● మొత్తం మొదటి డివిజన్‌లో 8,639 మంది, సెకెండ్ డివిజన్‌లో 775 మంది, థర్డ్ డివిజన్‌లో 245 మంది ఉత్తీర్ణులయ్యారు.
● సాలూరులోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల (బాలికలు)లో శతశాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 77 మంది పరీక్ష రాయగా.. అందరూ పాసయ్యారు. ఇందులో 47 మంది 500 మార్కులు దాటారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జడ్పీహెచ్‌ఎస్ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 54 మందికి అందరూ పాసయ్యారు.
● కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 540 మంది పరీక్ష రాయగా.. ఇందులో 498 మంది ఉత్తీర్ణత సాధించారు.
● జిల్లాలోని 57 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 2,218 మంది పరీక్షలు రాయగా 2,150 మంది (96.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● గురుకులాలకు సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 414 మంది విద్యార్థులకు 401 మంది (96.03)శాతం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 224 మందికి 223 మంది (99.50 శాతం) ఉత్తీర్ణులయ్యారు.