
సత్యనారాయణ నేత్రదానం
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్‌వీ మొహెర్ సుధాకర్, ఎన్‌వీ సురేష్, ఎన్‌వీ రవికిషోర్, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్‌లను అభినందించారు.