
ఇక్కడ సున్నా శాతం
అక్కడ శతశాతం..
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రామభద్రపురం మండలంలోని బూసాయవలస కేజీబీవీ బాలికలు సెకెండియర్‌లో శతశాతం ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో సెకెండియర్‌లో 33 మందికి 33 మంది, ఫస్టియర్‌లో 33 మందికి 32 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్ విద్యార్థిని బి.షర్మిల బైపీసీలో 963/1000 మార్కులు సాధించింది. అయితే, రామభద్రపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జీరో శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షకు హాజరైన 14 మందికి అందరూ ఫెయిలయ్యారు. హైస్కూల్ ప్లస్‌లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విద్యాబోధనకు అర్హత ఉన్న అధ్యాపకులను నియమించకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే కళాశాలలపై నిర్లక్ష్యం తగదంటున్నారు. – రామభద్రపురం

ఇక్కడ సున్నా శాతం