
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
● విజేత బలిజిపేట
● బహుమతులు అందజేసిన ఏఆర్ ఏఎస్పీ
విజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్‌లో నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్‌లో ముగింపు వేడుకలకు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వాలీబాల్ పోటీలలో నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధికి చెందిన ఏఆర్,సివిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేసిన గోపాలరావు ఏఆర్ విభాగానికి ఓ డాక్టర్‌గా సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఙాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం ఆయన సేవలను గుర్తుంచుకోవడమేనన్నారు.ఈ టోర్నమెంట్‌లో ప్రథమస్థానంలో నిలిచిన బలిజిపేట జట్టుకు రూ.12 వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన గంట్యాడ జట్టుకు రూ.8 వేలు తృతీయ స్థానంలో నిలిచిన కొత్తవలస జట్టుకు రూ.6 వేలు కన్సొలేషన్ ప్రైజ్‌గా విజయనగరం జట్టుకు రూ.4 వేలు ఏఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐలు గోపాలరావు, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, మహేష్, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ కుటుంబసభ్యలు పాల్గొన్నారు.