
ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
పార్వతీపురంటౌన్: ఏపీయూడబ్ల్యూజేఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో నియమించారు. పూర్తిస్థాయి జిల్లా కమిటీ ఏర్పాటుతో పాటు కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజక వర్గాల కార్యవర్గాల ఏర్పాటుకు కమిటీ తీర్మానించింది. అంతవరకు అడహాక్ కమిటీ అధ్యక్షుడిగా డీఎస్‌ఆర్ పట్నాయక్, కార్యదర్శిగా కేవీ నారాయణరావు నాగు, ఉపాధ్యక్షుడిగా తలేనవీన్, కోశాధికారిగా అంటిపేట సోమశేఖర్, సంయుక్త కార్యదర్శిగా సాలాపు ప్రసాద్‌తో పాటు పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటించి కమిటీల ఏర్పాటుతోపాటు సంఘాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు.