
బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లిమర్ల మండలం చంపావతి నది తీరప్రాంతంలో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది సీ్త్ర, పురుషులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 2 నుంచి 4 వరకు కాకినాడలో జరగనున్న 12వ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంపిక పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేసన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడిపేన లక్ష్మణరావు, ట్రెజరర్ శివ, వ్యాయామ ఉపాధ్యాయులు తౌడు బాబు, శ్రీను, గోపాల్, భాను, తిరుపతిరావు, ఆదిబాబు, వెంకటరావులు పర్యవేక్షించారు.
వచ్చే నెల 2 నుంచి కాకినాడలో రాష్ట్రస్థాయి పోటీలు