గణకులు లేకుండా..
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
8లో
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి సిబ్బంది కొరత వెంటాడుతోంది. సహాయ గణాంక శాఖాధికార పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి వెళ్లే వారే గానీ.. వచ్చే వారు ఎవరూ ఉండడం లేదు. దీంతో ఉన్నవారే ఏళ్ల తరబడి ‘చిక్కుకుపోతున్నారు’. మండలాల్లో ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన గణాంకాలకు వీరే కీలకం. అటువంటి ‘లెక్కల’ మాస్టార్ల పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండిపోవడంతో ‘లెక్కలు’ గతి తప్పుతున్నాయి. ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. 15 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున సహాయ గణాంకాధికారులు(ఏఎస్‌వోలు) బాధ్యతలు నిర్వర్తించాలి. జిల్లా కేంద్రంలో ముగ్గురు ఏఎస్‌వోలు ఉండాలి. ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్మమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ, భామిని, పాచిపెంట, సాలూరు మండలాల్లో పోస్టులు ఖాళీలున్నాయి. మిగిలిన మండలాల ఏఎస్‌వోలతోనే అదనపు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. మొత్తంగా 15 మండలాల్లో ఏడుగురే పని చేస్తున్నారు.
ప్రమోషన్లు తక్కువ.. పని భారం ఎక్కువ
ఏఎస్‌వోలు ఏళ్ల తరబడి ఒకే క్యాడర్‌లో పని చేస్తుండడం వల్ల పని భారం అధికమవుతోంది. దీంతో పాటు.. ప్రమోషన్లు ఉండడం లేదు. మండలానికి ఒకే పోస్టు ఉండడం వల్ల ఎదుగూబొదుగూ ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. పేరుకే గ్రూప్–2 ఉద్యోగాలు అయినప్పటికీ కనీసం తమకు సహాయకులు కూడా ఉండరని వాపోతున్నారు. రాష్ట్రంలో 285 వరకు ఏఎస్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. మండలంలో పనిచేసే వీఆర్వోలకు, ఆర్‌ఐలకు కూడా సహాయకులు ఉంటారని.. తమకు ఎవరూ ఉండరని చెబుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యంలాంటి ఏజెన్సీ ప్రాంతానికి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీలు చేపట్టినా కొంత మార్పు కనిపిస్తోందని ఆశిస్తున్నారు.
న్యూస్‌రీల్
ఉదయాన్నే వర్షపాతం కొలిచింది మొదలు..
ప్రణాళికా శాఖలో సహాయ
గణాంకాధికారి పోస్టులు ఖాళీ
15 మండలాల్లో సగం ఖాళీలే
ఒక్కొక్కరికీ లెక్కకు మించి బాధ్యతలు
తలకు మించిన భారం
మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే సహాయ గణాంకాధికారి.. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలను ప్రతిరోజూ ఉదయం ఆన్‌లైన్‌లో పొందుపరచడం ద్వారా ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో స్థూల ఉత్పత్తిని లెక్కించడం ప్రైమరీ సెక్టార్(వ్యవసాయం), ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీసు సెక్టార్‌ల నుంచి డేటాను సేకరించడం... జనాభా గణన, ప్రజల నైపుణాన్ని అంచనా వేయడం, సామాజిక ఆర్థిక గణన, చిన్న తరహా నీటి వనరుల గణన, వ్యవసాయ కమతాల గణన, పారిశ్రామిక సర్వేలు చేపడతారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పీ 4 సర్వేలోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రెయిన్‌గేజ్ ద్వారా వీరికి వర్షపాతం సేకరణ అలవాటు లేకపోయినప్పటికీ ఆ బాధ్యతను కూడా అప్పగించారు. ఆ యంత్రాల్లో సాంకేతికంగా ఏమైనా ఇబ్బందైనా అవస్థలు పడాల్సిందే. టెక్నికల్‌గా అంత సామర్థ్యం వీరి వద్ద ఉండదు.
గణకులు లేకుండా..


