
రోబోటిక్స్ కోర్సులకు డిమాండ్
చికెన్
నెల్లిమర్ల రూరల్: రానున్న కాలంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కోర్సులకు మంచి డిమాండ్ ఉందని గాయత్రి విద్యా పరిషత్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ ధర్వేకర్ అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రోబోతాన్ 2కే25 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న రంగంలో పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టుల మూల్యంకనం చేసి బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి, ప్రొఫెసర్ దీపక్ కుమార్, సన్నీ డియోల్, పీఎస్వీ రమణారావు, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.