
గంజాయి కేసులో ఐదవ నిందితుడి అరెస్టు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి అక్రమ రవాణా జరుగుతున్న 147 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన వారిలో నలుగురిని గత నెల 31న పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో సీఐ నారాయణరావు, ఎస్ వి ప్రసాదరావులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపుచేయడంతో మండలకేంద్రంలోని బైసాస్ రోడ్డులో మంగళవారం ఐదవ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అరకు మండలం తురాయిగూడ గ్రామానికి చెందిన కొర్రా కోగేశ్వరరావు ఇంటర్మీడియట్ పాసై అరుకులో శ్యామ్‌గణేష్ ఫంగి అనే మెడికల్ షాపులో యజమాని వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఫంగి మెడికల్ షాపు నిర్వహిస్తూ కొర్రా కోగేశ్వరరావు ద్వారా ఒడిశా నుంచి కొద్దికొద్దిగా గంజాయి అక్రమరవాణా చేస్తూ పెందుర్తిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు సరఫరాచేసేవాడు. 2024 ఫిబ్రవరిలో కారులో 150 కిలల గంజాయి అక్రమరవాణా చేస్తూ శ్యామ్‌గణేష్ పంగితో పాటు కారు డ్రైవర్ కొర్రా కోగేశ్వరరావులు పోలీసులకు పట్టుబడ్డారు.అప్పట్లో వారిపై కేసునమోదు చేసి వైజాగ్ సెంట్రజైల్‌కు తరలించారు.జైలులో ఉన్న సమయంలో కోగేశ్వరరావుకు మరో గంజాయి స్మగ్లర్ శెట్టి ఉమామహేశ్వరరావు పరిచయమయ్యాడు.వారిద్దరు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి అక్రమరవాణా ప్రారంభించారు. ఈ క్రమంలో పెదబయలు నుంచి ఈఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కారులో గంజాయి తరలిస్తూ కొట్టక్కి వద్ద పోలీసులకు పట్టుపడడంతో కారు వదిలేసి పరారయ్యారు. మార్చి 31న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలించగా మంగళవారం కారు డ్రైవర్ కోగేశ్వరరావు పట్టుబడ్డాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన మరి కొంతమంది నిదింతుల కోసం గాలిస్తున్నారు.