
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం స్కూటీని వెనుక నుంచి వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.బొబ్బిలి పట్టణానికి చెందిన పట్నాయకుని అనిల్‌కుమార్, భార్య శ్రీదేవి స్కూటీపై సీతానగరంలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ముడుపుల పూజకు వస్తున్నారు. లచ్చయ్యపేట వచ్చే సమయానికి వెనుకనుంచి వస్తున్న బొలెరో వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో శ్రీదేవి తలకు బలమైన గాయం కాగా ఇద్దరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీదేవి మృతి చెందింది. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
బైక్‌ను ఢీ కొట్టిన బొలెరో: వ్యక్తికి గాయాలు
మండలంలోని జాతీయరహదారిపై లచ్చయ్యపేట– కింతలివానిపేట గ్రామాల మధ్య ఉన్న హనుమాన్ గుడివద్ద మోటార్ సైకిల్‌ను ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలికి చెందిన ఆదిమూలం కిరణ్‌కుమార్ బొబ్బిలి నుంచి పార్వతీపురం బైక్‌పై వస్తున్న సమయంలో పార్వతీపురం నుంచి బొబ్బిలి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వస్తున్న కిరణ్ కుమార్ రోడ్డుపై పడిపోగా బలమైన గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు.
చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి
చీపురుపల్లి రూరల్: గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కోరాడ రామస్వామి(51) అనే వ్యక్తి కొబ్బరిచెట్టు నుంచి కిందికి పడి మృతిచెందాడు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామస్వామి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ కొబ్బరి బొండాల కోసం చెట్లు ఎక్కి తీసుకువచ్చి వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం ఉదయం కూడా చీపురుపల్లి మండలంలోని ఆర్ధివలస గ్రామంలో కొబ్బరి బొండాల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో బొండాలు తీస్తుండగా కత్తి కాలుకు తగలడంతో చెట్టు నుంచి కిందికి జారి పడిపోయాడు. గాయాలతో ఉన్న రామస్వామిని హాస్పటల్‌కు తీసుకువెళ్లేందకు సమయాత్తమవుతుండగా మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై ఎల్.దామోదరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీకొని యువకుడు..
రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొబ్బిలి పట్టణంలోని సంగవీధికి చెందిన పిట్ట రమేష్ (30) ప్రయా ణిస్తున్న బైక్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో రాజాం నుంచి వస్తున్న బైక్‌ను అదుపుచేసుకోలేక ఢీకొనడంతో రమేష్ రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన రమేష్‌ను స్థానికుల సహాయంతో రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందదించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదిలా ఉండగా మరో వాహనదారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ అశోక్‌కుమార్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.
స్కూటీని ఢీకొట్టిన వ్యాన్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి