
గిరిజన గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
● నోటిఫికేషన్ విడుదల చేసిన గురుకులం సొసైటీ ● ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ● పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 1200 సీట్ల భర్తీ ● నేటి నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 24న కౌన్సెలింగ్
సీతంపేట:
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన గురుకుల సొసైటీ ఆన్‌లైన్‌లో శనివారం నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తోంది. గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు అధికారులు ఉచిత, భోజన వసతి, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు సమకూరుస్తారు. కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినట్టేనన్నది విద్యావేత్తల మాట. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు బోధిస్తున్నారు. మొత్తం అన్ని గ్రూ పులు కలిపి 1270 సీట్లు ఉన్నాయి. వీటికోసం ఏటా 2 వేల మంది విద్యార్థులు పోటి పడుతున్నారు.
మెరిట్ ఆధారంగానే...
ఈ దఫా పదో తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపునకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈలకు ఒక్కో సీటు చొప్పున కేటాయిస్తారు. ఒకేషన ల్ ఏఅండ్‌టీ–20, సీజీఏ గ్రూపు లో 30 చొప్పున సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించా రు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
షెడ్యూల్ ఇలా..
దరఖాస్తులు ఆన్‌లైన్ చేయాల్సిన
తేదీ ప్రారంభం: 26.04.2025
దరఖాస్తు చేసుకునే చివరి తేదీ: 18.05.2025
మెరిట్‌జాబితా ప్రకటన: 20.05.2025
మొదటి కౌన్సెలింగ్: 24.05.2025
రెండో విడత కౌన్సెలింగ్: 30.05.2025
తరగతులు ప్రారంభం: 02.06.2025

గిరిజన గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు