
రెడ్‌క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు–1(డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ ఎంఎల్‌టీ, అకౌంటెంట్ పోస్టు–1(ఏదైనా డిగ్రీ, టాలీ అనుభవం ఉండాలి), జన ఔషధి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ పోస్టు–1(బి.ఫార్మశీ లేదా డి.ఫార్మసీ విద్యార్హత)కు అర్హత గల అభ్యర్థులు ఈనెల 21 వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 08922–272700, 9493092700, 6305042755 లను సంప్రదించాలని సూచించారు.
కరెంట్ పోల్‌పై
తిరగబడ్డ జేసీబీ
సాలూరు రూరల్: మండలంలోని కొదమ పంచాయతీ అడ్డుగూడ, కోడంగివలస గ్రామాల మధ్యలో ఘాట్‌రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ట్రాలీపై తీసుకువెళ్తున్న జేసీబీ తిరగబడి పక్కనే ఉన్న కరెంట్ పోల్‌పై పడింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
యువకుడి అదృశ్యంపై
కేసు నమోదు
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం పరిధిలో ఓలేటి వారి ఫారం సమీపంలో నివాసం ఉంటున్న రాహుల్ పండిత్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం నుంచి ఆచూకీ లేవకపోవడంతో తండ్రి ముఖేష్ పండిత్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు.
చికిత్స పొందుతూ
వీఆర్‌ఏ మృతి
సీతానగరం: మండలంలోని వెంకటాపురం(కామందొరవలస)రెవెన్యూ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ తోట నాగయ్య విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 16న ఇంట్లో చెదలు నివారణకని తెచ్చి ఉంచిన చెదల నివారణ మందును వీఆర్‌ఏ నాగయ్య యాదృచ్ఛికంగా తాగాడు. చెదల నివారణమందు తాగినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా నాటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు తెలియజేశారు. సోమవారం వీఆర్‌ఏ తోట నాగయ్య మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు తెలియజేశారు. మృతుడు నాగయ్య అంత్యక్రియల నిమిత్తం తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆదేశాలమేరకు ఆర్‌ఐ నాగి రెడ్డి శ్రీనివాసరావు, వీఆర్వో బాబూరావు రూ.10వేలు కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నాగయ్య కుటుంబాన్ని సచివాలయ ఉద్యోగులు పరామర్శించి సానుభూతి వెలిబుచ్చారు.
పశువుల రవాణాను
అడ్డుకున్న పోలీసులు
లక్కవరపుకోట: అక్రమంగా వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్న వాహనాలను ఎల్.కోట ఎస్సై నవీన్‌పడాల్ తన సిబ్బందితో కలిసి సోమవారం అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామం సంతనుంచి నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాల్లో అధిక పశువులను ఎక్కించి రవాణా చేస్తున్న వాహనాలను భీమాళి జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలతో పాటూ పశువులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి పశువులను సమీపంలో గల గోశాలకు తరలించారు. ఈ మేరకు రెండు వాహనాలను సీజ్ చేసి సంబంధిత డ్రైవర్లను విచారణచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రెడ్‌క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రెడ్‌క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం