తమ్ముళ్లకే ఉపాధి
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మా మాటే శాసనం..
● ఉపాధి హామీ పథకంలో కూటమి పెత్తనం ● పనుల్లో రాజకీయం ● మొన్నటి వరకూ క్షేత్ర సహాయకులపై కత్తి.. ● ఇప్పుడు మేట్ల తొలగింపు ● ఆ స్థానంలో తమవారిని నియమించుకుంటున్న వైనం
తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం తక్షణ మే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అలజంగి విఘ్నేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫీజు రీయింబ ర్స్‌మెంట్ చెల్లించని కారణంగా కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న ఎంతోమంది విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అంబేడ్కర్ దార్శనికత దేశానికే మార్గనిర్దేశం
● కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్
విజయనగరం అర్బన్: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని, ఆయన దార్శనికత దేశానికి మార్గనిర్దేశం ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి, విద్యావేత్త ప్రొఫెసర్ సంజయ్ పాశ్వాన్ అన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణం మరియు మహిళా సాధికారతలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అణచివేత, సాధికారత వంటి సమస్యల పరిష్కారంలో అంబేడ్కర్ చొరవను కొనియాడారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ మహిళలకు చట్టపరమైన సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లుకు ఆయన చేసిన కృషిని వివరించారు. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు విషయాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చారన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ప్రమాణ్ణి జయదేవ్ మాట్లాడుతూ సామాజిక పనిలో అంబేడ్కర్ తత్వశాస్త్రం ప్రాముఖ్యతను, సమ్మిళిత విధాన రూపకల్పనపై ఆయన ప్రభావాన్ని వివరించారు. యూనివర్సిటీ వీసీ టీవీ కట్టిమణి మాట్లాడుతూ సమాజహితమైన అంశాలపై కళాశాల స్థాయి విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహించడం వల్ల చైతన్యవంతమై సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అనంత రం ముఖ్య అతిథులను వీసీ సత్కరించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉపాధి వేతనదారులపై స్థానిక నాయకు లు కక్ష సాధిస్తున్నారని పాలకొండ మండలంలోని ఎల్.ఎల్. పురం గ్రామానికి చెందిన వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ ద్వారపూడి సావిత్రమ్మను కలిసి పలువురు వాపోయారు. గ్రామ పంచాయతీ పరిధిలో 300 మంది వేతనదారులు ఉన్నారు. ఆరుగురు మేట్ల పర్యవేక్షణలో కాలువ, ఫారంపాండ్స్ వంటి పనులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూటమి నాయకులు పాత మేట్లను తొలగించి, కొత్తవారిని నియమించడానికి ప్రయత్నిస్తున్నారని వేతనదారులు చల్లా పార్వతి, సుశీల, భవానీ, నక్క ఆనంద్ తదితరులు వాపోతున్నారు. రాజకీయ కారణాలతో పనులు కూడా
జరగనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
●బలిజిపేట మండలంలోని బర్లి మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌పై దర్యాప్తుల పేరున రాజకీయ వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు లేవనెత్తి అధికారులపై ఒత్తిడి పెట్టి దర్యాప్తు చేయిస్తున్నారు. పాత ఆరోపణలే ఎత్తిచూపుతూ దర్యాప్తు చేస్తుండడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నడూ లేని, చూడని విధంగా ఉపాధిహామీ వేతనదారులు, మేట్లుపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజక వర్గాల్లో సాగుతున్న ఉపాధి హామీ పనులు కూటమి తమ్ముళ్లకు ఉపాధి మార్గాలుగా మారిపోయాయి. వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు పొందడం ఒక ఎత్తు అయితే.. ఉపాధి హామీ పథకంలో ఏళ్లుగా పని చేస్తున్న క్షేత్ర సహాయకులు, మేట్లు వంటి చిన్న ఉద్యోగుల పోస్టులను కూడా వదలడం లేదు. ప్రధానంగా టీడీపీ నాయకులు తమ అనుచరులకు వీటిని కట్టబెట్టేందుకు పోటీపడుతున్నారు. మొన్నటి వరకు పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోని పలువురు క్షేత్ర సహాయకులను అక్రమంగా తొలగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఉపాధి మేట్లును కూడా టీడీపీ నాయకులు తొలగిస్తూ ఆ స్థానంలో తమ వారిని నియమించుకుంటున్నారు. వీరికి మద్దతుగా వేతనదారులు పలుచోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నా.. కూటమి నాయకుల్లో మార్పు రావడం లేదు. అధికారుల్లో చలనం కలగడం లేదు. కొత్తగా తమ్ముళ్ల ప్రోద్బలంతో నియమితులైన మేట్లు.. వేతనదారుల మధ్య గ్రూపులు ప్రోత్సహించడం, వారికి ఇష్టం వచ్చిన వారికే పనులు ఇవ్వడం, మిగిలిన వేతనదారుల పట్ల ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై పలుచోట్ల వేతనదారులు ఆయా ఎంపీడీవోల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 1.69 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. 52.23 వేల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నాయి. సగటున 50 నుంచి 60 మంది వేతనదారులకు ఒక్కోమేట్ చొప్పున ఉంటారు. సాధారణంగా ఆయా వేతనదారుల అభిప్రాయం మేరకు స్థానికులనే మేటుగా నియమించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ఉపాధి పనుల్లో కూటమి ప్రభుత్వం పుణ్యమా అని రాజకీయ గ్రహణం పట్టుకుంది.
19న వాష్ కేంద్రబృందం
సందర్శన
బాడంగి: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్ (వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ, గ్రామీణరక్షితనీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్‌జీవన్‌మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాన్ని గురువారం పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ ఢిల్ల్శ్వేరరావు, పంచాయతీ విస్తరణాధికారి సూర్యనారాయణ, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాలవలస గౌరు, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ఉపాధి వేతనదారులతో రాజకీయం చేస్తున్నారని పాలకొండ మండలంలోని చిన మంగళాపురం సర్పంచ్ గోగుల కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు వేతనదారులతో కలిసి సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. వీరి గ్రామంలో 343 మంది ఉపాధి వేతనదారులున్నారు. గతంలో వారి అంగీకారంతోనే ఆరుగురు మేట్లును ఏర్పాటు చేసుకున్నారు. చాలా కాలంపాటు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జాబ్ కార్డుదారులు పనులు చేసుకునేవారు. ఏ సమస్య లేకున్నా.. కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మేట్లను నిబంధనలకు విరుద్ధంగా, వేతనదారుల తప్పుడు సంతకాలతో విధులకు దూరం చేశారు. వారి స్థానంలో రాజకీయం చేసి, కొత్తవారికి అవకాశం కల్పించటంతోపాటు దశాబ్ద కాలంగా అనుభవం ఉన్న వారిని అన్యాయంగా తప్పించారని సర్పంచ్ తోపాటు.. వేతనదారుల ఆవేదన.
జియ్యమ్మవలస మండలం జోగులమ్మ పంచాయతీలో ఉపాధి హామీ పథకం వేతనదారులకు పనికల్పనలో రాజకీయ వేధింపులు మితిమీరా యి. వేతనదారులందరి ముందు కాళ్లుపట్టుకుంటనే పనులు కల్పిస్తామంటూ టీడీపీకి చెందిన ఎలకల శంకరబాబు, కాబోతుల ఇల్లంనాయుడు వేధించడంతో వేతనదారు బూరి గౌరమ్మ ఇటీవల గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో వేతనదారులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి.
తమ్ముళ్లకే ఉపాధి
తమ్ముళ్లకే ఉపాధి
తమ్ముళ్లకే ఉపాధి
తమ్ముళ్లకే ఉపాధి


