
అనుమానాస్పద స్థితిలో పారిశుధ్య కార్మికుడి మృతి
భామిని: మండలంలోని తాలాడకు చెందిన పారిశుధ్య కార్మికుడు గొర్లె భీముడు(52) బుధవారం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడ్డాడని బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన తగాదాలో గాయపడి అపస్మారకస్థితిలో పడి ఉన్న గోర్లె భీముడు(52)ను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన భార్య రోదిస్తూ తెలిపిందని చెప్పారు. ఈ సంఘటనపై పాలకొండ సీఐ చంద్రమౌళి తాలాడ గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌కు వివరాలు అందివ్వాలని గ్రామస్తులను సూచించారు. గొర్లె బీముడు(52)మృతిపై భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పాలకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.