
పెళ్లిబృందంపై తేనెటీగల దాడి
● 50 మందికి గాయాలు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలం, శివ్వన్నపేటలో శుక్రవారం జరిగిన తేనెటీగల దాడిలో 50 మందికి పైబడి గాయపడ్డారు. క్షతగా త్రులంతా పెళ్లి వేడుకకు వచ్చిన వారుగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో డీజే సౌండ్‌కు ఆస్పత్రి దగ్గర చెట్టు పైనున్న తేనెటీగలు ఒక్కసారిగా అక్కడి వారిపైకి దూసుకొచ్చి, గాయపరిచాయి. స్థానికుల సహకారంతో గాయపడిన వారి ని చికిత్స నిమిత్తం కురుపాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నాగేశ్వరరావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రికి తరలించారు.