
ఉగ్రదాడి క్షమించరానిది
–10లో
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
జాతీయ ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్వతీపురంటౌన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి క్షమించరానిదని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జోగారావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఉగ్రవాదుల కు భారత్ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. భారత జాతీయ సమగ్రతను, ఐక్యతను కాపాడు కుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జి, బలగ నాగేశ్వరరావు, పార్టీ మండలాధ్యక్షుడు బొంగు చిట్టిరా జు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, పార్టీ ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములునాయుడు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలి
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ