జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు పంట పొలాల్లో ఏనుగులు శుక్రవారం దర్శనమిచ్చాయి. ఉదయం కొమరాడ మండలం దళాయిపేటలో ఉన్న ఏనుగులు సాయంత్రాని కి బిత్రపాడు పరిసర ప్రాంతాల్లోకి జారుకున్నా యి. రాత్రి సమయాన గ్రామంలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కోత దశలో ఉన్న వరి పంటను ధ్వంసంచేస్తాయని బెంగపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
కొత్త బాధ్యతలు
● వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షునిగా సింగారపు ఈశ్వరరావు
పార్వతీపురంటౌన్: వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షునిగా సాలూరు నియోజకవర్గా నికి చెందిన సింగారపు ఈశ్వరరావు నియామకమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
జిల్లా జడ్జికి ఎస్పీ శుభాకాంక్షలు
పార్వతీపురం రూరల్: విజయనగరం జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.బబితను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ఆమె చాంబర్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధి త ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు న్యాయ, పోలీస్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతాయని తెలిపారు.
నేడు వివిధ పథకాలు, ప్రాజెక్టులపై సమీక్ష
పార్వతీపురంటౌన్: జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలు, ప్రాజెక్టులపై శనివారం ట్వంటీ పాయింట్ ప్రొగ్రాం చైర్మన్ లండా దినకర్ సమీక్షించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై అధికారులందరూ పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
కొత్త సిలబస్‌పై అవగాహన తరగతులు
పార్వతీపురంటౌన్: ఇంటర్‌లో కొత్త సిలబస్‌పై పార్వతీపురం జూనియర్ కళాశాలలో ఆన్‌లైన్ ఓరియంటేషన్ తరగతులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజులా వీణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు లాంగ్వేజీలతో పాటూ 14 విభాగాల సిలబస్, పాఠ్యపుస్తకాల ను నూతన సిలబస్‌తో ప్రారంభించనుందన్నా రు. ఈ మేరకు అధ్యాపకులకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమం మే 6 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

బిత్రపాడులో ఏనుగుల గుంపు