
ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌ఈఐ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీఆర్‌ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం జిల్లాలో నిర్వహించిన 6 కేంద్రాల్లో 1,288 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,064 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పూట 10 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షను 1,891 మంది రాశారు. ఏపీఆర్‌డీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 77 మంది అభ్యర్థుల్లో 65 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన అకస్మికంగా తనిఖీచేశారు. ఆయన వెంట పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు ఉన్నారు.