
ఆటో ఢీకొని యువకుడికి గాయాలు
గంట్యాడ: విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన యువకుడు నొడగల గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గణేష్ బైక్‌పై గంట్యాడ మండలం పెదవేమలి వైపు వస్తుండగా గంట్యాడ మండలం మురపాక నుంచి ఎదురుగా వస్తున్న ఆటో పెదవేమలి, కోరుకొండపాలెం మధ్య గెడ్డ సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో గణేష్ కింద పడిపోగా కాలు విరిగిపోయింది. స్థానికులు 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొని మహిళకు..
సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో సోమవారం రాత్రి అంటిపేట వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఓ మహిళ గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంటిపేట ప్రజలకు కూడలిగా ఉండే రావిచెట్టు సమీపంలో గాడి లక్ష్మి రోడ్డు దాటుతుండగా బొబ్బిలి మండలం అప్పయ్యపేట గ్రామానికి చెందిన మోటార్ సైక్లిస్ట్ సీతానగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మిని ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

ఆటో ఢీకొని యువకుడికి గాయాలు