
అడ్డుకట్ట ఏదీ?
–8లో
ఒడిశా కవ్వింపు చర్యలకు..
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సాలూరు నియోజకవర్గ పరిధి వివాదాస్పద కొటియా గ్రామాల గిరిజన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు రక్షణ కల్పించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. సాలూరులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొటియాలో ఉన్న 21 గ్రామాల సమస్య స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అలానే ఉందని గుర్తు చేశారు. తాను పుట్టకముందు నుంచే ఈ సమస్య ఉందని.. నానాటికీ పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అక్కడ జన్మభూమి కార్యక్రమం చేపట్టిందని.. అప్పటి నుంచే ఒడిశా ప్రభుత్వం, అక్కడి అధికారుల కవ్వింపు, దూకుడు చర్యలు మరింతగా ఎక్కువయ్యాయని.. గిరిజనులను ఇబ్బందులు పెట్టడం అధికం చేశారని చెప్పారు. మన ప్రభుత్వ భవనాలు, ఇతర ఆస్తులను కూలుస్తూ, కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని తెలిపారు.
అనేకమార్లు గ్రామాల్లో కాలినడకన పర్యటించా..
తాను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతోందని.. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ధూళిభద్ర మీదుగా కొటియాకు 2018లో నడిచి వెళ్లానని తెలిపారు. పలుమార్లు కొటియా గ్రామాల్లో పర్యటించి, అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు వారంతా ఆంధ్రాలోనే ఉండేందుకు మొగ్గు చూపారని చెప్పారు. ఎగువ కొటియా, దిగువ కొటియా వంటి కొన్ని గ్రామాలు మినహా.. మిగిలిన చాలా వరకు గ్రామాల ప్రజలంతా ఇదే స్పష్టం చేశారని గుర్తు చేశారు. వారి కోసం మన రాష్ట్రం నుంచి ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ల వద్దకు వెళ్లి మొర వినిపించుకున్నా..
అండగా నిలవలేకపోతున్నారని తెలిపారు. 2021లో తాను, అప్పటి ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఆ గ్రామాల పర్యటనకు వెళ్తే.. అక్కడి వారు దండయాత్ర చేశారని గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఒడిశా ముఖ్యమంత్రి
న్యూస్‌రీల్
గనుల కోసమని అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు తవ్వుకుంటే ఏం చేస్తున్నారు?
నవంబరు 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో కలిసి చర్చిస్తే... ఇప్పుడున్న మంత్రి విమర్శలు చేశారని, గనుల బేరాలంటూ లేనిపోని ఆరోపణలకు దిగారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఒడిశా వారు.. అక్కడున్న గనులను మనవైపు నుంచి తవ్వుకుంటూ పోతోంటే, మన మంత్రి, కూటమి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మన పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు పడగొడుతున్నారు. తాగునీటి పైప్‌లైను పనులను అడ్డుకుంటున్నారు.. పోలీస్‌స్టేషన్‌లకు తీసుకెళ్తున్నారు. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, గిరిజన శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు? అని మంత్రి సంధ్యారాణిని ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పట్లో గోబ్యాక్ ఆంధ్రా అంటూ కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ స్వయంగా అన్నారని.. తాము గట్టిగా వ్యతిరేకించామని... అదే మంత్రి గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు వస్తే గౌరవంగానే స్వాగతిస్తే టీడీపీ వారు విమర్శలకు దిగారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.. ఎందుకు కూటమి నాయకులు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
ఆంధ్రాలోనే ఉంటామని కొటియా గిరిజనులు అంటున్నారు..
అక్కడి ప్రభుత్వ పథకాల లబ్ధిని తిరస్కరించేందుకు వారంతా సిద్ధమే..
గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీ, కూటమి ప్రభుత్వానిదే..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపుతారని ఆశిస్తున్నా...
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర

అడ్డుకట్ట ఏదీ?