
తప్పని ఆధార్ తిప్పలు
● కార్డులో మార్పులకు అవస్థలు
● జిల్లాలో పనిచేయని కేంద్రాలు
● సచివాలయాల్లో మూలన పడిన
పరికరాలు
● జిల్లా కేంద్రంలో పోస్టాఫీసు వద్ద మాత్రమే నమోదు
పార్వతీపురంటౌన్:
● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఊర్మిళ తన చంటి బిడ్డతో దయనీయంగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద వేచిచూస్తోంది. తనకు ఆధార్‌లో అడ్రస్ మార్పు గ్రామ సచివాలయంలో అవడం లేదని జిల్లా కేంద్రంలో బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ కార్యాలయాల వద్ద అప్‌డేట్ అవుతుందన్న సమాచారం తెలుసుకుని పట్టణానికి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని, 4గంటల కాలం పాటు వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది.
● కొమరాడ మండలం పొడుగువలస గ్రామానికి చెందిన కిల్లక అరుణ మూడు రోజులుగా ఆధార్ అప్‌డేట్ కోసం వేచి చూస్తోంది. ప్రతిరోజూ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వచ్చి వేచి చూస్తున్నా ఆమెకు టోకెన్ దొరకడం లేదు. సిబ్బందిని టోకెన్ కావాలని అడగ్గా వారం రోజుల పాటు టోకెన్లు ఇచ్చేశామని, అయినా సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
● పార్వతీపురం మండలం ఆర్‌కె బట్టివలస గ్రామానికి చెందిన వెంకీ తన కుమార్తె, కుమారుడు నాని, దివ్యల ఆధార్ అప్‌డేట్ చేయడానికి మూడు రోజులుగా పార్వతీపురం పట్టణంలోని పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ టోకెన్లు లేవన్న కారణంతో అప్‌డేట్ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు.

తప్పని ఆధార్ తిప్పలు

తప్పని ఆధార్ తిప్పలు

తప్పని ఆధార్ తిప్పలు