అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలి
పార్వతీపురం టౌన్: పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ విద్యాశా ఖ, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదే శించారు. పాఠశాలల్లో అడ్మిషన్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల విద్యా, ఆరోగ్య స్థాయిలపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులందరూ ఒకటో తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలలో చేరకుండా ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల 19న వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, 21వ తేదీ నాటికి పిల్లలు అందరూ పాఠశాలల్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఒకటవ తరగతిలో 10,932 మంది చేరార ని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా విద్యార్థులు చేరాలన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 9,200 సీట్లు ఉన్నాయని తెలిపారు.
వయస్సుకు తగిన బరువు, పెరుగుదల ఉండాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల బరువు, పెరుగుదల వయస్సుకు తగ్గట్టుగా ఉండా లని ఐసీడీఎస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సూపర్‌వైజర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నా రు. గుమ్మ, సీతంపేట ప్రాంతంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు చిన్నారుల పెరుగుదల, బరువు ఉండ డం లేదని, దీనిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. పోషణ పక్వాడ కిట్లను పక్కాగా అందించాలని పేర్కొన్నారు.
2 నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ
శిశువు జన్మించిన రెండు నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శి జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జనన ధ్రువీకర ణ పత్రాలు జారీచేయకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ నిర్వహణ కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి డాక్టర్ టి. కనకదుర్గ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎన్.కష్ణవేణి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం. డి.గయాజుద్దీన్, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఇ.అప్పన్న, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రాజేశ్వరరావు, సీడీపీఓలు, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.


