
విద్యార్థి ఆత్మహత్య
రామభద్రపురం: చైన్నె వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఓ బాలుడు తీరని శోకం మిగిల్చాడు. పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో రిజల్ట్స్’ రాకముందుగానే ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టక్కి గ్రామానికి చెందిన కర్రి దుర్గాప్రసాద్(15) తల్లిదండ్రులు పార్వతి, పార్వతీశం చైన్నె వలస వెళ్లడంతో కొట్టక్కిలోని అమ్మమ్మ పెంటమ్మ వద్ద ఉంటూ అక్కడే ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలు 23న విడుదల కానున్నాయని ప్రకటన వెలువడడంతో ఫెయిలవుతానని భయంతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే సాలూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. విద్యార్థి అనుమానించినట్లుగానే పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అమ్మమ్మ పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
పదవ తరగతిలో ఫెయిలవుతానని భయం